TV CHANNELS

GCV TV9 TeluguSakshi TVNTV TeluguABN TeluguTV5 TeluguiNews TeluguHM TVTV1 TeluguMahaa TV TeluguStudioNETV TeluguETV2 TeluguGemini TeluguTeja TeluguMaaTV TeluguMaaMusic TeluguZee TeluguATV TeluguVanitha TVYupp TV
only search Telugumint website

Recent Posts

హైదరాబాద్: తోచీ తోయనమ్మ తోడికోడలు పుట్టింటికి వెళ్ళిందని సామెత. అలాగే ఉంది చంద్రబాబు నాయుడి ధోరణి. ముఖ్యమంత్రి రోశయ్యను చూసి చంద్రబాబునాయుడికి జాలి కలిగిందేమో! వరదల సమయంలో ఒక ముఖ్యమంత్రి ఎలా వ్యవహరించాలో చంద్రబాబు రోశయ్యగారికి ముచ్చటగా మూడు సార్లు ఫోన్ చేసి వివరించినట్టు తెలుస్తోంది. వైయస్ సిఎంగా ఉండగా ఏనాడూ ఇటువంటి సలహాలు ఇవ్వని చంద్రబాబు కు ఇప్పుడు రోశయ్య అంటే ఇంత ప్రేమ ఎందుకు కలుగుతోందని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ముక్కున వేలేసుకుంటున్నారు.

అసెంబ్లీలో చంద్రబాబు నాయుడి మీదకు రోశయ్యను వైయస్ ఉసిగొల్పేవారు. కన్నతండ్రి వంటి మామగారికీ వెన్ను పోటు పొడిచి, ఆయనను మానసిక క్షోభను గురిచేశావంటూ కొన్ని డజన్ల సార్లు రోశయ్య సభాముఖంగా చంద్రబాబుకు చివాట్లు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. రోశయ్య వాక్చాతుర్యానికి చంద్రబాబు తోకముడిస్తే వైయస్ ముసి ముసిగా నవ్వుకునేవారు. అలాగే రోశయ్య మీదికి చంద్రబాబు నాగం జనార్ధనరెడ్డిని ఉసిగొల్పేవారు.

ఇది ఆపత్కాలం. అందరూ రాజకీయాలను మరిచి జనాన్ని గట్టెక్కించడానికి సూచనలు సలహాలు ఇస్తే మంచిదే. కానీ వాటి వెనుక చిత్తశుద్ధి ఎంత ఉందన్న ప్రశ్న తలెత్తక మానదు. చంద్రబాబు నాయుడు తన వంతుగా తన పార్టీ నిధుల నుంచి వరద సహాయ నిధికి కొంత సొమ్మును విరాళంగా ప్రకటించి ఉంటే బాగుండేది. వైయస్ జగన్ 20 లక్షల విరాళం ప్రకటించిన తర్వాత అయినా చంద్రబాబుకు ఆ మంచి ఆలోచన రాకపోవడం శోచనీయమే.

మామూలుగా అయితే "ఏదో పెద్ద చెప్పోచ్చావ్, మాకు తెలియదా?" అని చంద్రబాబుపై రోశయ్య విసుక్కునే వారే. కానీ సొంతపార్టీలో అతిపెద్ద జగన్ గ్రూపును ఎదుర్కొంటూ రాజకీయ వరదలో మునిగితేలుతున్న రోశయ్య చంద్రబాబు సలహాలను సహృదయంతో తీసుకుంన్నట్టు నటించి ఉంటారు. ముందు ముందు చంద్రబాబు పరోక్ష సహకారం రోశయ్యకు కావలసి ఉంటుంది. రాజకీయ దురంధరుడికి ఆ మాత్రం తెలియదా? తాతయ్యకు గద్దులు నేర్పాలా? ఏదేమైనా రాజకీయాలను పక్క బెట్టి ఆపత్కాలంలో అందరూ సామాన్య ప్రజల కోసం కృషి చేయాలి

0 Comments:

Post a Comment



Requests & Complaints

online counter

16 FM Channels